Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సానిటేషన్ పనులపై అవగాహన

సానిటేషన్ పనులపై అవగాహన

వతెలంగాణ - జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో శానిటేషన్ ప్రక్రియలో భాగంగా తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని గురించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్ యంబరి విద్య ఆధ్వర్యంలో ఎంపీఓ రాము నిర్వహించామని జిపి కార్యదర్శి తెలిపారు.

ఈ సందర్భంగా యంబరి విద్య ఎంపీఓ, సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో నిత్యం సానిటేషన్ పనులు అనునిత్యం నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాలలో తడి, పొడి చెత్త, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించి వాటిని వేరువేరుగా విడదీసి ట్రాక్టర్ లో వేయాలని తెలిపారు. గ్రామాలలో వర్షపు నీరు నిలవకుండా గుంతలు అన్ని పూడ్చివేయాలని ఆదేశించారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీ ఓ రాము, జిపిఓ, జిపి కార్యదర్శి , జిపి కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana