Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సావర్ గావ్ అంగన్వాడీలో అన్నప్రాసన

సావర్ గావ్ అంగన్వాడీలో అన్నప్రాసన

వతెలంగాణ - జుక్కల్ మండలంలోని సావర్ గావ్ తాండ గ్రామంలో సోమవారం అంగన్వాడి టీచర్ బుజ్జి బాయ్ ఆధ్వర్యంలో అన్నప్రాసన, పిల్లలకు వైద్య పరీక్షలు, పౌష్టికాహారం అందజేశామని జిపి కార్యదర్శి తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గర్భిణీలకు , బాలింతలకు , పౌష్టికాహారం తీసుకోవడం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన పోషక పదార్థాలు అంగన్వాడీలో లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమము నిర్వహించారు. అనంతరం చిన్నారుల ఎత్తు, బరువు పరీక్షించారు.

అదేవిధంగా పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లు బాలింతలకు , గర్భిణీలకు, పిల్లలకు , అందజేశారు. అనంతరం గ్రామంలో అర్హులైన చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రం లో చేర్పించాలని కోరుతు తాండలోని ఇంటింటికి తిరిగి అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు వార్డు సభ్యులు పరశురాం , బాలాజీ , అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana