Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైన్స్ ఫిక్షన్ డ్రామాతో 'తక్షక`

సైన్స్ ఫిక్షన్ డ్రామాతో 'తక్షక`

చిరంజీవితో 'విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తక్షక. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు.

ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మల్లిడి సత్యనారాయణరెడ్డి కుటుం బంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. తనకి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత డా.లతారాజుకి థ్యాంక్స్. లతా రాజు అబ్బాయి కుశాల్ రాజు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. తమ అబ్బాయి హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి నిర్మాతగా లతా కొత్త అయినా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా విజయం సాధించి కుశాల్ రాజు హీరోగా పేరు తెచ్చుకోవాలి, అలాగే మా కృష్ణ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి అని అన్నారు. 'సరికొత్త సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలున్న చిత్రమిది. మహాభారత కాలం నుంచి నేటి వరకు వేల ఏళ్లుగా జరిగిన అద్భుతమైన సన్నివేశాలు మా సినిమాలో ఉంటాయి. ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ, రీసెర్చ్ చేస్తూ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు మా డైరెక్టర్ కృష్ణ మల్లిడి. అలాగే మా చిత్రానికి ఫిల్లర్ లా నిలబడిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబీకి కృతజ్ఞతలు. నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్న మా అన్నయ్య డా.నరేంద్రనాథ్ రాజుకు థ్యాంక్స్అని ప్రొడ్యూసర్ డా. లతారాజు చెప్పారు. 'మా "మూవీ ఓపెనింగ్ వినాయక్ చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు పోస్టర్ లాంచ్ కూడా ఆయనే చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అయి దర్శకుడిగా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ చేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం. సినిమా సక్సెస్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం అని దర్శకుడు కృష్ణ మల్లిడి చెప్పారు.
హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ,'త్వరలోనే మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఈ చిత్రం కోసం నేను, మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశాం. మా డైరెక్టర్ విజన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నా` అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana