Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ మృతి

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ మృతి

- మూడు రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన మహిళా- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగిన బంధువులు
- ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి:
ప్రసవం కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది.

ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన చౌటకూర్ మండలం బద్రి గూడెం గ్రామానికి చెందిన అనిత( 33) సంవత్సరాలు భర్త శ్రీశైలం, 9 నెలల గర్భిణీ అయిన ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 10వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా గర్భిణీ చికిత్స పొందుతున్న క్రమంలో 12వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో అనితకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అనిత మృతి వార్త తెలియడంతో ఆగ్రహించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. గత మూడు రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వైద్యులు, సిబ్బంది డెలివరీ చేస్తామంటూ నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మూడు రోజులుగా బాగున్నా ఏ విధంగా చనిపోతుందని, ఆమె చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే అనిత ప్రాణాలు కోల్పోయింది అని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత డాక్టర్లు మరియు వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సంగారెడ్డి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న బంధువులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana