- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు .
నవంబర్ 15న వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయ గర్జన సభకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ అత్యధిక సభ్యత్వం కలిగిన టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు. ఏడేండ్ల పాలనలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివద్ధితోపాటు విద్య , వైద్య రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. సమావేశంలో భాగంగా భోలక్‌పూర్ డివిజన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సింగరావు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మనరేష్, హేమలత, ఎడ్ల హరిబాబుయాదవ్, ఎండీ పరీషరీన్, సీనియర్ నాయకులు పెంటారెడ్డి, రెబారామారావు సుధాకర్ గుప్తా, రవీందర్, ముఠా జైసింహ, బోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, ఆర్ మోజెస్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

