Dailyhunt

సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలపై గ్రామసభ

వతెలంగాణ - భీంగల్ : భీంగల్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం జరిగింది.

ఆయా గ్రామాల్లో గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారి నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. భీంగల్, జాగిర్యాల్, మెండోరా, బడా భీంగల్, ముచ్కూర్ గ్రామలలో మండల ప్రత్యేక అధికారి డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కు గ్యాస్ సిలిండర్, సన్న రకం వడ్ల కొనుగోలు బోనస్, చేయూత పెన్షన్లు, గృహ జ్యోతి కార్యక్రమంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డులు మొదలగు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ లబ్ధిదారులతో గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడించగా తెలంగాణ ప్రభుత్వం నకు సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందినట్లు తెలిపారు. గ్రామాల్లోని ప్రాధాన్య సమస్యలు గుర్తించి వాటిని ఫిర్యాదుల బాక్సులో వేయాలని అధికారులు గ్రామ ప్రజలకు తెలిపారు. గ్రామలలోని సమస్యల గుర్తింపు సమస్యల ప్రాధాన్యత నిర్ణయము ప్రభుత్వము అందించబోతున్న కొత్త పథకాలపై గ్రామ సభలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు,గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు రైతులు యువకులు , పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana