Dailyhunt
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి లో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ నవతెలంగాణ - కామారెడ్డి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్ ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ గడ్డపై తొలి బహుజన చక్రవర్తిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి చిరస్థాయి ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. నిరంకుశ రాచరికాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన మహానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు జూలూరి సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బాని హరికృష్ణ, మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ, పిడుగు సాయి బాబా, రవీందర్ గౌడ్, సునీల్ గౌడ్, మెహర్ బాబా గౌడ్, చేవెళ్ల రాజు, నర్సుల మహేష్, శేఖర్, బల్ల శ్రీనివాస్, కర్ణాకర్, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana