Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సత్యదేవ్నట విశ్వరూపం

సత్యదేవ్నట విశ్వరూపం

ప్రతి నటుడికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అభినయంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్ తాజాగా రాబోయే సినిమాల్లో సైతం భిన్న పాత్రలను పోషిస్తున్నారు.

ఆయా పాత్రలతో ఆయన నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు మరోమారు చూడబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. 'రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో వెర్సటైల్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్

'రావు బహదూర్'.
ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తోంది. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిం చడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న 'ఓ సుందరి' పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా మేకర్స్ 'ఇన్ టూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్' పేరుతో ఓ బీటీఎస్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో చిత్ర నిర్మాణ వైభవం, ప్రీ-ప్రొడక్షన్ పనులు, ప్రోస్తెటిక్ మేకప్, భారీ సెట్స్, షూటింగ్ విశేషాలను చూపిస్తూ సినిమా స్కేల్ను పరిచయం చేశారు. విజువల్గా అద్భుతంగా, పాత్రల ఆధారంగా నడిచే ఓ విభిన్నమైన సినిమాటిక్ అనుభవాన్ని ఈ చిత్రం అందించబోతోందనే సంకేతాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ సత్యదేవ్ చేసిన అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్. సెట్స్కు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక మేకప్, స్టైలింగ్ ప్రక్రియలో పాల్గొనే విధానాన్ని ఇందులో చూపించారు. వయసు మీద పడిన రాజరిక పాత్ర కోసం బాల్డ్ క్యాప్, ప్రత్యేక ప్రోస్తెటిక్స్, పొడవాటి తెల్లజుట్టు, దట్టమైన గడ్డం, మెలితిరిగిన మీసాలతో ఆయన ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారు. ప్రత్యేక కాంటాక్ట్ లెన్సులు, గ్రాండ్ గా డిజైన్ చేసిన షేర్వాణీ, ముత్యాల హారాలు, సంప్రదాయ తలపాగా వంటి గెటప్ తో సత్యదేవ్ రాజవంశీయుడి హుందాతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాలో ఆయన విభిన్న లుక్స్ను కూడా ఈ వీడియోలో చూపించారు.

సమవర్తి
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి 'సమ వర్తి` అనే టైటిల్ ను ఖరారు చేశారు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. ఈ సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్లు, కత్తులతో కొందరు దూసుకురాగా, ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. సత్యదేవ్ కెరీర్లో ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ అవుతుందనే అంచనాలు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana