Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెన్సెస్ సర్వే సరళిని పరిశీలించిన ఎమ్మార్వో

సెన్సెస్ సర్వే సరళిని పరిశీలించిన ఎమ్మార్వో

వతెలంగాణ - జుక్కల్ మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలో సెన్సెస్ సర్వే సరలిని చుక్కలు ఎమ్మార్వో మారుతి శనివారం గ్రామ సర్పంచ్ శకుంతల పాలు తో కలిసి పరిశీలించారని కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. మహ్మదాబాద్ గ్రామం లోని ఎంపియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంబ్లే గోపాల్ ఎమ్మినేటరుగా సిబ్బందితో కలిసి సెన్సెస్ సర్వేన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతంగా గ్రామంలో పుట్టింటికి తిరుగుతూ మ్యాపింగ్ వేయడం జరుగుతుందని ఎమ్మార్వో అన్నారు. సెన్సెస్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఇటువంటి తప్పులు జరుగుతున్న అధికారులు నిబంధనలు పాటించాలని అన్నారు. గ్రామాలలోని ప్రజలు సర్వేకు వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి కుటుంబానికి సంబంధించిన వివరాలను తప్పకుండా అందించాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మార్వో తో పాటు గ్రామ సర్పంచ్ శకుంతల బాలు, ఉప సర్పంచ్ ,జిపి కార్యదర్శి , ఉపాధ్యాయుడు కాంబ్లే గోపాల్ , ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana