హైదరాబాద్ : మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నగరంలోని బొరివలీ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన షాపింగ్ కాంప్లెక్స్ సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది.. 14 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం.. అదే సమయంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున షాపులు అగ్నికి ఆహుతయ్యాయని..

