Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శత్రువుల ఆయుధాల రవాణాను అనుమతించం: ఇరాన్

శత్రువుల ఆయుధాల రవాణాను అనుమతించం: ఇరాన్

వతెలంగాణ-హైదరాబాద్: శత్రువుల ఆయుధాలను ఇకపై కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించేందుకు అనుమతించమని ఇరాన్ ప్రథమ ఉపాధ్యాక్షుడు మొహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు.

హార్ముజ్ పై సార్వభౌమత్వాన్ని వదులుకున్నామని, తమపై ప్రయోగించేందుకు ఉద్దేశించిన ఆయుధాలను కూడా గతంలో ఈ జలసంధి నుండి రవాణా అయ్యేందుకు అనుమతించామని అన్నారు. ఇకపై వాటిని అనుమతించమని స్పష్టం చేశారు.

హార్ముజ్ జలసంధిలో నిర్దేశిత మార్గం ద్వారా సముద్ర రవాణాను నియంత్రించడానికి ఇరాన్ ఒక యంత్రాంగాన్ని సిద్ధం చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ పేర్కొన్నారు. త్వరలో యంత్రాంగంను ప్రవేశపెడతామని అన్నారు. ఈ యంత్రాంగం ఇరాన్ సార్వభౌమాధికారం పరిధిలో, అంతర్జాతీయ వాణిజ్య భద్రతను నిర్థారించే లక్ష్యంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ యంత్రాంగంతో వాణిజ్య నౌకలు, ఇరాన్ కు సహకరించే పక్షాలు మ్రాతమే ప్రయోజనం పొందుతాయని అన్నారు. `ఫ్రీడమ్ ప్రాజెక్ట్' (అమెరికా) సంస్థతో సంబంధం ఉన్న సంస్థలకు ప్రతిపాదిత మార్గం మూసివేసి ఉంటుందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana