Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శత్రువులను పూర్తిగా ఛిద్రము చేస్తాం: ఇరాన్

శత్రువులను పూర్తిగా ఛిద్రము చేస్తాం: ఇరాన్

వతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతిచర్చల పేరుతో ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే రెండు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.

శాంతి చర్చలకు ఇరాన్ తొందరగా అంగీకరించాలని, లేకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఘాటు హెచ్చరికలు జారీ చేసింది.

''ఇరాన్పై మళ్లీ దాడులు జరిగితే.. ఈసారి పశ్చిమాసియా ప్రాంతాన్ని దాటి యుద్ధం మరింత విస్తరిస్తుంది. మా విధ్వంసక దాడులు శత్రువులను పూర్తిగా ఛిద్రము చేస్తాయి.'' అని వార్నింగ్ ఇచ్చింది. ''ఇరాన్ మాత్రం ఇప్పటివరకు తమ పూర్తి సైనిక శక్తిని ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రెండు సైన్యాల పూర్తి శక్తితో అమెరికా-జియోనిస్టు బలగాలు మాపై దాడి చేశాయి. అయినా మేము ఇప్పటికీ ఇస్లామిక్ పూర్తి శక్తిని వినియోగించలేదు'' అని IRGC పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana