Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకరి మహాసన హైస్కూల్లో పది విద్యార్థులకు ఘన సన్మానం

శ్రీకరి మహాసన హైస్కూల్లో పది విద్యార్థులకు ఘన సన్మానం

విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం ప్రశంసలునవతెలంగాణ-నాచారం

ల్లాపూర్, బ్రహ్మపురి కాలనీ స్థానిక శ్రీకరి మహాసన హైస్కూల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి తొలి బ్యాచ్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా అభినందించింది.

ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూ, వారి కృషిని కొనియాడారు. పాఠశాల చైర్మన్ ఎన్. సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నిర్వహణ సభ్యులు సుచిత్ర రేఖ, పద్మజ రేఖ, గిరిజా రమణి మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని తెలిపారు.

వైస్ చైర్మన్ ఎన్. పుష్పలత విద్యార్థులకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుష్మా సింగ్ మాట్లాడుతూ, తొలి బ్యాచ్ మంచి ఫలితాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana