Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలీల-తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్పై స్పందించిన హీరోయిన్ తల్లి

శ్రీలీల-తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్పై స్పందించిన హీరోయిన్ తల్లి

వతెలంగాణ - హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె తల్లి స్వర్ణలత తెరదించారు.

ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఖరాఖండిగా తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల్లో అణువంత కూడా నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ స్వర్ణలత మాట్లాడుతూ.. 'ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్తో పాటు చదువులపైనా పూర్తి దృష్టి పెట్టింది. సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా తన వైద్య విద్యపై ఏకాగ్రత చూపుతోంది. ముఖ్యంగా నీట్-పీజీ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే దశకు ఇంకా చాలా సమయం ఉంది. బహుశా మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాతే ఆ విషయాలపై దృష్టి పెడుతుంది' అని వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana