Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీజనల్ వ్యాధులపై డాక్టర్లు కాపర్లకు అవగాహన కల్పించాలి: దయ్యాల నరసింహ

సీజనల్ వ్యాధులపై డాక్టర్లు కాపర్లకు అవగాహన కల్పించాలి: దయ్యాల నరసింహ

వతెలంగాణ - భువనగిరి కలెక్టరేట్ : సీజనల్ వ్యాధులపై డాక్టర్లు గొర్రెల మేకల పెంపకం దారులకు అవగాహన కల్పించాలని, వారికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆశ్రయించి నష్టపోతున్నారని గొర్రెల మేకల పెంకుందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ అన్నారు.

శనివారం భువనగిరి మండలంలోని వీరవల్లి గ్రామంలో గొర్రెల మేకల పెంపంకం దారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గొర్రెల మందల వద్ద కాపర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ మందులు సరైన సమయానికి రాకపోవడం వలన ప్రైవేటు మందులు వాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సంఘం పోరాటం ద్వారా 559, 1016, 64 జీవోలను సాధించామని, గొర్ల కాపరులు ప్రభుత్వ భూములలో ఉచితంగా గొర్రెలను మేపుకోవచ్చని, గొర్రెల కాపరి విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు చనిపోతే లక్ష రూపాయలు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుందని, దానిని పది లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో డాక్టర్లు మందల వద్దకు వచ్చి ట్రీట్మెంట్ చేసేదని, ప్రస్తుతం కూడా అదే పద్ధతిలో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాక జహంగీర్, మండల ఉపాధ్యక్షులు తోటకూర అశోక్, సంఘం అధ్యక్షులు దయ్యాల మహేష్, చిన్నం శ్రీశైలం, నోముల కుమార్, రేగు మల్లేశం, మోటే బీరయ్య, జట్ట ఐలయ్య, జట్ట మల్లయ్య, మోటే సత్తయ్య, జెట్ట శ్రీనివాస్, స్వామి, కుమార్, చంద్రయ్య, కాపర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana