హైదరాబాద్ : ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయరెడ్డి (సినారె) 90వ జయంతి సందర్భంగా ఆ సాహితీమూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. 'సాహితీ ప్రపంచంలో వారి స్థానం ప్రత్యేకమైనదని నేను అత్యంత అభిమానించే తెలుగు కవుల్లో సినారె తొలి వరుసలో ఉంటారు.. రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారాల మేళవింపుగా సాగిన వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధి వేశాయి.. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినారె గారిని తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుందని' వెంకయ్య ట్విట్టర్లో పేర్కొన్నారు.

