Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినర్ చరిత్ర

సినర్ చరిత్ర

టాలియన్ ఓపెన్ టైటిల్ వశంరోమ్ (ఇటలీ) : ఇటలీ స్టార్, వరల్డ్ నం.1 జానిక్ సినర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లు తొమ్మిదింటిని సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 31 ఏండ్ల వయసులో ఈ ఘనత సాధించగా.. జానిక్ సినర్ 24 ఏండ్లకే ఈ మైలురాయి చేరుకున్నాడు. ఈ సీజన్లో ఏకంగా వరుసగా ఐదు ఏటీపీ మాస్టర్స్ విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా సినర్ నిలిచాడు. సోమవారం జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో జానిక్ సినర్ 6-4, 6-4తో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్పై వరుస సెట్లలో ఘన విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో ఉక్రెయిన్ అమ్మాయి ఎలినా స్విటోలినా చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana