Wednesday, 20 Jun, 1.45 am

హోం
సింహాల ఫొటోలు తీయడం కూడా నేరమే

హైదరాబాద్‌ : సింహాలను సంరక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. సింహాలను ఫొటోలు తీసినా నేరమే అని, కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించిన వారికి అటవీ సంరక్షణ చట్టం 1978 కింద ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని తెలిపింది. వేటాడటం అంటే చంపడం మాత్రమే కాదని, హింసించినా అది వేటే అవుతుందని గురాత్ అటవీశాఖ మంత్రి గణ్ పత్ వాసవ తెలిపారు. రాష్ట్రంలో సింహాల ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించినా, వాహనాలపై వాటిని వెంబడించినా, ఫొటోలు తీసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుజరాత్ లో సింహాలను వెంటాడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు అవి కనిపిస్తే మాంసాహారాలు విసరడం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Dailyhunt
Top