Dailyhunt
సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

వతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసుగౌడ్ సర్వాయి పాపన్న చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బత్తుల జయమ్మ దాసు గౌడ్ మాట్లాడుతూ..

సర్వాయి పాపన్న సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలు,ప్రజలకు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా నాయకులు బండారు నరసింహ,బత్తుల దాసు,బొడ్డు రాజు, సంతంగి సోమరాజు, ఎర్రంశెట్టి ప్రసాద్, వీరమల్ల యాదయ్య, చందగల రాజు, కంభంపాటి నరసింహ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana