Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియా ప్రచారంతో పర్యాటక గుర్తింపు

సోషల్ మీడియా ప్రచారంతో పర్యాటక గుర్తింపు

- బెస్ట్ కంటెంట్ క్రియటర్ లకు నగదు బాహుమతినవతెలంగాణ - ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకురావడం కోసమే యూటూబర్లు, ఇన్ఫ్లూయర్లకు రీల్స్ కంపిటిషన్ నిర్వహించమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

గత మూడు రోజుల క్రితం పిలుపు మేరకు పలువురు యూటూబర్ లు జిల్లాలోని పర్యటక ప్రాంతాలు, ప్రాచీన దేవాలయాలు, జలపాతాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయగా ప్రజల నుంచి వచ్చిన స్పందనను గుర్తించి విజేతలుగా ప్రకటించారు. ఇందులో భాగంగానే గురువారం టీటీడీసీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు యూటూబర్స్ ఇన్, యూటూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలను తిలకించి అత్యధికంగా వ్యూవర్స్ పొందిన ప్రతమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపిక చేసి నగదుతో పాటు ప్రశంత పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని వాటిని బాహ్యో ప్రపంచానికి తెలియజేస్తే జిల్లాకు మంచి పర్యాటక గుర్తింపు లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాటిలో ఎత్తైన కుంటాల జలపాతం, ప్రాచీన జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, ఉట్నూర్ లోని గోండు రాజుల కోట ఇలా ఎన్నో చూడదగ్గ ప్రాంతాలున్నాయన్నారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ కొండలు, కోనలు అనేకంగా ఉన్నాయన్నారు.

దీంతో పాటు ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన శైలి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుందన్నారు. జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, అటవీ ప్రాంతాలు, ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక పండుగలను డిజిటల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా యువత పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఆనందదాయకమన్నారు. పోటీలో పాల్గొన్న ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోల నాణ్యత, సమయపాలన, సోషల్ మీడియాలో వచ్చిన అత్యధిక వీక్షణల ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా ఉపయోగించి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ డిజిటల్ ప్రచారం ద్వారా హైదరాబాద్తో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు జిల్లా పర్యాటక విశేషాలు చేరువయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించి జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రథమ బహుమతి 1.6 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించిన రంగినేని సాయికృష్ణ, ద్వితీయ బహుమతి.

పెండూర్ కిరణ్, తృతీయ బహుమతి జె.రవి, తోడసం కైలాష్ సంయుక్త విజేతలుగా నిలిచారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న ఇతర క్రియేటర్లందరికీ 'సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్' తో పాటు నగదు బహుమతి అందజేసి వారి కృషిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, టూరిజం అధికారి రవి కుమార్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, జర్నలిస్టులు, సభ్యులు, స్థానిక కళాకారులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana