Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడి

స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడి

- రాజకీయ ఒత్తిళ్లతో కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు
నవతెలంగాణ-రాంనగర్‌
చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీఎస్పీ ప్రధాన రహదారిపై ఉన్న స్పైస్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో మెనూ విష యమై జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వాన గా మారింది. మంగళవారం రాత్రి సుమారు 20 మంది యువకులు మద్యం మత్తులో కర్రలతో ఫాస్ట్ఫుడ్‌ సెంటర్‌పై విచక్షణ రహితంగా దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలో పాస్పోర్ట్‌ సెంటర్‌ ఉద్యోగి దీపక్‌ యజమాని పర్వేశ్వర్‌ రెడ్డి తీవ్రంగా గాయాలపాలయ్యారు.రాజకీయ ఒత్తిళ్లతో నిందితులను అరెస్టు చేయడం లేదని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ యజమాని పరమేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు.

దాడి చేసిన వారిలో ఒకరిని గుర్తించి పోలీసులకు అప్పగించగా వారు అతన్ని వదిలిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దాడి జరిగిన దాడి కుట్ర వెనుక ముషీరాబాద్‌ కార్పొరేటర్‌ ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్‌ భర్త టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్‌ ఉన్నట్టు నిర్వహకుడు ఆరోపించారు.ఈ దాడి దృష్యాలను నిర్వాహకుడు మీడియా దృష్టికి తీసుకుపోవడంతో చిక్కడపల్లి సీఐ నిర్వాహకుడిని మందలించినట్టు వాపోయారు. ఈ దాడి విషయమై నవ తెలంగాణ ప్రతినిధి ఎడ్ల హరిబాబు యాదవ్‌ను ఫోన్లో సంప్రదించగా తనకు సంబంధం లేదని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana