Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థూపం స్థలాన్ని కాపాడుకోవాలి

స్థూపం స్థలాన్ని కాపాడుకోవాలి

- జేఏసీ ఆధ్వర్యంలో స్థూప స్థల సాధన కమిటీ నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో అమరుల స్తూప స్థలాన్ని అందరం కలిసి కాపాడుకోవాలని అఖిలపక్ష నాయకులు అన్నారు.

బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సిపిఐ, బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ,ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, జేఏసీ పాల్గొని హుస్నాబాద్ అమరుల స్థూప స్థల సాధన కమిటీ ఏర్పాటు చేశారు. సందర్భంగా కమిటీ ఛైర్మన్ గా కవ్వ లక్ష్మారెడ్డి ఏనుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆక్రమించబడిన స్థూపం స్థలాన్ని పార్టీల భాగస్వామ్యం తో కాపాడుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో ఛైర్మెన్ లుగా గడిపే మల్లేష్, మహమ్మద్ అన్వర్, జెరిపోతుల ఆంజనేయులు, పశ్చిమట్ల రవీందర్ గౌడ్, ప్రధానకార్యదర్శి గా మేకల వీరన్న యాదవ్, కార్యదర్శులు గా గూడెం లక్ష్మి, తోడేటి రమేష్, బండి పుష్ప, జంగ విజయ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana