Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సునేహ్రా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్

సునేహ్రా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్

వతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు రంగంలో అగ్రశ్రేణి జీవిత బీమా సంస్థల్లో ఒకటైన జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (జిసిఎల్ఐసిఎల్) సునేహ్రా పింఛన్ పథకాన్ని ప్రారంభించింది.

ఇది పాలసీదారులు వారి భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పదవీ విరమణ నిధిని నిర్మించుకోవడంలో సహాయపడే లక్ష్యంతో రూపుదిద్దుకున్న భాగస్వామ్య (పిఏఆర్), ఆన్-లింక్డ్, పింఛన్, పొదుపు-ఆధారిత జీవిత బీమా పథకం. తన ప్రధానమైన బీమా ప్రయోజనాలతో పాటు ఉచిత ఆరోగ్య సేవలను కూడా ఈ పథకం అందిస్తుంది. తమ పాలసీదారులకు సమగ్రమైన విలువను అందించాలనే జనరాలీ సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వారి నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తోంది.

జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రపంచ బీమా దిగ్గజ కంపెనీ అయిన జనరాలీ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలయికలోని ఉమ్మడి సంస్థ, ఇది అంతర్జాతీయ నైపుణ్యాన్ని స్థానిక బ్యాంకింగ్ వారసత్వాన్ని మేళవిస్తోంది.

2022లో భారతదేశంలో 20.5%గా ఉన్న వయోధికుల జనాభా 2050 నాటికి సుమారు 20.8% అంటే దాదాదాపు రెట్టింపు అవుతుందని అంచనా(1). అదే సమయంలో, పింఛన్ ఆస్తులు అతి తక్కువగా, జిడిపిలో కేవలం 17% మాత్రమే, అంటే అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే ~80% మేరకు ఉంటాయి (2), పటిష్టమైన పదవీవిరమణ సన్నద్ధత అత్యవసరమనే విషయాన్ని ఇది గట్టిగా నొక్కి చెబుతోంది. ఈ సరికొత్త వాస్తవికతను గుర్తించి, జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సునేహ్రా పింఛన్ పథకం వ్యక్తులు తమ పదవీ విరమణ కోసం మరింత సమర్థవంతమైన ప్రణాళికను వేసుకోవడానికి, ఒక నిధిని క్రమబద్ధమైన రీతిలో నిర్మించుకోవడానికి, పదవీవిరమణ తరువాత తాము గడిపే జీవితాల్లో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి దోహదం చేసే విధంగా రూపొందింది.

ఒక పిఎఆర్ పథకం కాబట్టి, సునేహ్రా పింఛన్ పథకం కింద బోనస్ల జమ మొదటి ఏడాది నుంచే ఆరంభమవుతుంది, తద్వారా పెరుగుతూ ఉండే మొత్తం ద్వారా పాలసీదారులు దీర్ఘకాలికమైన లభిస్తుంది. అలాగే 5 నుంచి 40 ఏళ్ళ వరకూ కాలపరిమితిని ఎంచుకొనే సౌలభ్యాన్ని ఈ పథకం అందిస్తోంది, కాబట్టి మరణం లేదా గడువు ముగిసిన సమయంలో హామీతో కూడిన ప్రయోజనాలతో పాటు ఇది అన్ని వయసుల వ్యక్తులకూ అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో పాక్షిక ఉపసంహరణల ద్వారా నగదు లభ్యతను, పాలసీ వ్యవధి మొత్తంలో సింగిల్ పే, లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే లాంటి బహుళమైన ప్రీమియం చెల్లింపు ఎంపికలను, ఐచ్ఛికమైన రైడర్ల ద్వారా రక్షణను పెంచుకొనే సామర్థ్యాన్ని కూడా ఇది అందిస్తుంది, తద్వారా సమగ్రమైన, సానుకూలమైన పదవీ విరమణ ప్రణాళిక పరిష్కారానికి వీలు కలిగిస్తుంది.

రెండు సందర్భాలలో హామీతో కూడిన ప్రయోజనాలను ఈ పథకం అందిస్తుంది. పాలసీదారుడు పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే, వారు వెస్టింగ్ చెల్లింపును అందుకుంటారు. ఇది గడువు ముగిసిన సమయానికి హామీ పొందిన బీమా మొత్తాన్ని (ఆర్జించిన బోనస్లు ఉన్నట్టయితే వాటితో పాటు) లేదా చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% - ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మేరకు ఉంటుంది, ఇది వారి పదవీవిరమణ ఆదాయానికి బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణించిన దురదృష్టకరమైన సందర్భంలో, మరణంపై లభించే హామీ ప్రయోజనం (ఆర్జించిన బోనస్లు ఉన్నట్టయితే వాటితో పాటు) లేదా చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% వీటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని పొందడానికి నామినీ అర్హులు అవుతారు.

పాలసీ ముగిసినప్పుడు, సరెండర్ చేసినప్పుడు లేదా ఒక వేళ మరణం సందర్భంలో చేసిన క్లయిమ్ల ద్వారా లభించే మొత్తాన్ని కొన్ని మార్గాల్లో వినియోగించవచ్చు. వినియోగదారు జనరాలీ సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లేదా మరో బీమాదారు నుంచి ఒక యాన్యుటీని (తక్షణం లేదా వాయిదా వేసుకొని) కొనుగోలు చేయవచ్చు, కొంత భాగాన్ని ఏకమొత్తంగా తీసుకొని, మిగిలినదాన్ని రెగ్యులర్ ఆదాయం పొందడానికి వినియోగించుకోవచ్చు లేదా మరణం సందర్భంలో చేసే క్లయిమ్ ద్వారా వచ్చే పూర్తి డబ్బును ఏకమొత్తంగా తీసుకోవచ్చు.

దీర్ఘకాలిక సంపద సృష్టికి పరిమితం కాకుండా, పాలసీదారులకు రాయితీతో కూడిన వార్షిక ఆరోగ్య పరీక్షలు, తగ్గించిన ధరలపై ల్యాబ్లలో రోగ నిర్ధారణ పరీక్షలు, టెలికన్సల్టేషన్ ద్వారా సెకెండ్ మెడికల్ ఒపీనియన్స్, ఆన్లైన్ వైద్య సంప్రదింపులు లాంటి వవెల్నెస్ సేవలను విస్తృత శ్రేణిలో సునేహ్రా పింఛన్ పథకం అందిస్తుంది. అదనంగా అందించే ఈ సేవలన్నీ పాలసీదారులను పాలసీ కాలం అంతటా నిమగ్నం చేయడానికి, వారికి మద్దతును అందించడానికి, ఆర్థిక కవరేజికి మించిన విలువను అందించడానికి జనరాలి లైఫ్ ఇన్స్యూరెన్స్ కు ఉన్న నిబద్ధతను చాటిచెబుతున్నాయి.

ఈ పథకం ప్రాధాన్యతను జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎండి & సిఇఓ శ్రీ అలోక్ రుంగ్తా వివరిస్తూ 'పరిణామం చెందుతున్న సామాజిక-ఆర్థిక పరిస్థితుల్లో, కేవలం రక్షణ కల్పించడానికే కాకుండా దీర్ఘకాలికమైన ఆర్థిక భద్రతను అందించడంలో కూడా జీవిత బీమా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. భారతదేశంలో పెరుగుతున్న జీవితకాలం, అధికారిక పింఛన్ వ్యవస్థల పరిమితమైన వ్యాప్తిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, పదవీవిరమణ ప్రణాళికకు క్రమశిక్షణాయుతమైన, నిర్మాణాత్మకమైన దృక్పథం అవసరం. పదవీవిరమమణ చేతిన తరువాత గడిపే సంవత్సరాల కోసం వ్యక్తులు ముందుగానే సంసిద్ధులయ్యే విధంగా సాధికారత కల్పించడం ఆవశ్యకమని జనరాలీ సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో మేము విశ్వసిస్తాం. వినియోగదారులు నిలకడైన పదవీవిరమణ నిధిని నిర్మించుకోవడంలో సాయపడడం కోసం ఒక భాగస్వామ్య ఉత్పత్తి తాలూకు బలాన్ని దీర్ఘకాలిక పొదుపు తాలూకు స్థిరత్వంతో మిళితం చేయాలనే లక్ష్యాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సునేహ్రా పింఛన్ పథకాన్ని రూపొందించడం జరిగింది. వివిధ దశలలో వినియోగదారుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించి, జీవితంలోని వివిధ దశలలో వారికి ఆత్మవిశ్వాసాన్ని, భద్రతను కల్పించే పరిష్కారాలను అందించడంపై మా దృష్టిని కేంద్రీకరించాం' అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana