Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు

రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీసుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంపు
నవతెలంగాణ..న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు.

ఇప్పటివరకు, సీజేఐతో సహా సుప్రీం కోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 34గా ఉండగా ప్రస్తుత పెంపుతో ఆ సంఖ్య 38కి చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మే 5న ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు (న్యాయ మూర్తుల సంఖ్య) చట్టం, 1956ను సవరిస్తూ న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం ఈ ఆర్డినెన్స్ను నోటిఫై చేసింది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇందుకు అనుగుణంగా బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana