Dailyhunt
సూర్యాపేట జిల్లాలో విషాదం...

సూర్యాపేట జిల్లాలో విషాదం...

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిలుకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు..హుజూర్ నగర్, సీతారాం నగర్‌కు చెందిన 18 మంది కూలీలు నాటు వేసేందుకు చిలుకూరు మండలం సీతారాంపురం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana