Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'స్వేచ్ఛ అనేది కొద్దిమందికి బహుమతి కాదు'

'స్వేచ్ఛ అనేది కొద్దిమందికి బహుమతి కాదు'

- అర్నాబ్‌ గోస్వామి మధ్యంతర బెయిల్‌ పొడిగించిన సుప్రీం
న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ టివి ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిలు గడువును సుప్రీం కోర్టు మరో నాలుగు వారాలు పొడిగించింది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛనూ, సాధారణ ప్రజలకు బెయిల్‌ ఇచ్చే హక్కును కాపాడాలని న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు శుక్రవారం పిలుపునిచ్చింది. 'స్వేచ్ఛ కొద్దిమందికి బహుమతి కాదు' అని అన్నారు. హైకోర్టులను లేదా సుప్రీంకోర్టుకు తరలించడానికి మార్గాలు లేదా వనరులు లేని సాధారణ పౌరులు జైళ్లలో అండర్‌టైల్‌గా కొట్టుమిట్టాడుతున్నారని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. కనీసం ఒక్క రోజు అయినా వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం చాలా తీవ్రమైన విషయమని న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం 55 పేజీల ఉత్తర్వుల్లో శుక్రవారం ప్రకటించింది.

ఆర్కిటెక్చరల్‌ ఫర్మ్‌ అధిపతి ఆత్మహత్య చేసుకునే విధంగా అర్నాబ్‌ గోస్వామి తదితరులు ప్రేరేపించినట్టు చెప్పలేమని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. అర్నాబ్‌ పై ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేదకపోయారన్నారు. అయితే బాంబే హైకోర్టు తన అధికారాన్ని వినియోగించడంలో విఫలమైందన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కుల రక్షకుల పాత్రను హైకోర్టు పరిత్యజించింది. ఎంపిక చేసుకుని వేధించే సాధనంగా క్రిమినల్‌ చట్టం ప్రజల విషయంలో మారకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana