Dailyhunt
తాడిచెర్ల పీహెచ్సీని సిహెచ్సిగా మార్చాలి

తాడిచెర్ల పీహెచ్సీని సిహెచ్సిగా మార్చాలి

ర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, కుమార్ యాదవ్నవతెలంగాణ - మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ వెంకస్టశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామూహిక ఆరోగ్య కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు. సిహెచ్ గా మార్చితే 24 గంటల వైద్యం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న క్రమంలో చేను, చెలక వద్ద పాము కాటుకు గురైతే వైద్యం అందని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ఎవరైనా పురుగుల మందు తాగిన ప్రాథమిక వైద్యం అందరి పరిస్థితి ఉందన్నారు. పీహెచ్సీగా అప్గ్రేడ్ చేస్తే తాడిచెర్ల మల్లారం పెద్దతుండ్ల, చిన్నతుండ్ల, దబ్బగట్టు, దుబ్బపేటతో పాటు పలు గ్రామాల ప్రజలకు 24 గంటల వైద్యం అందుతుందన్నారు. మానేరుపై బ్రిడ్జి నిర్మాణం కావడంతో ఖమ్మంపల్లి, సందరెల్లి గ్రామాల ప్రజలు నిత్యం తరచూ రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. వారు కూడా ప్రస్తుతం ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు పొందుతున్నారన్నారు.

తాడిచెర్ల గ్రామంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా మైన్ కూడా సాగుతుండడంతో 24 గంటల వైద్యం అందుబాటులోకి తెస్తే ప్రజలకు మరింత మేలు కలగనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటవిమార్గంలో తాడిచర్ల భూపాలపల్లి రోడ్డు పనులు పూర్తయితే రవాణా మరింత పెరిగి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం 24 గంటల వైద్యం కోసం ఈ ప్రాంత ప్రజలు మహాదేవపూర్, భూపాలపల్లి లోని 100 పడకల ఆసుపత్రికి తరలి వెళ్తున్నారని తెలిపారు. పీహెచ్సీ ని సి హెచ్ సి గా అప్గ్రేడ్ చేస్తే నాణ్యమైన వైద్యం అందనుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana