- పోడు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
- సభా సంఘం సమావేశాలు సాగదీతకోసమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తున్నది.
ఈ క్రమంలో మంత్రి సత్యావతి రాథోడ్ అధ్యక్షతన ఉన్న మంత్రి వర్గ ఉప సంఘం సమావేశాల నిర్వహణ కాలయాపన కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలోనే ఇప్పటికే రెండు సార్లు క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ యింది. ఎందుకు వాయిదాలు వేస్తున్నారో కూడా చెప్పడం లేదు. తిరిగి సమావేశాల తేదీలను మాత్రం ప్రకటి స్తున్నారు. ఇదంతా కాలయాపన కోసం కాకపోతే మరేంటి? అనేప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటీ రెండేండ్లు కాదు.. దశాబ్దాలుగా పోడు భూము లపై హక్కుపత్రాలకోసం గిరిజనులు ప్రభు త్వాలను వేడుకుంటున్నారు. వారి సమస్యలను పరిష్క రించడంలో గత ఏడేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. అటవీ హక్కుల చట్టం ఉన్నా.. అమలు చేయడానికి సర్కారుకు చిత్తశుద్ధి లేదన్న విషయం తేటతెల్లమైంది. కూర్చీవేసుకుని కూర్చొని పరిష్కరిస్తానంటూ సీఎం చెప్పినా..మంత్రి వర్గ ఉప సంఘాలను వేసినా అవన్నీ..కంటి తుడుపు చర్యలేనని విధితమవుతున్నది.
ప్రభుత్వం సమస్య మూలాల్లోకి పోతుందా? : ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..సమస్య మూలాల్లోకి పోవాలి. కానీ..ఇప్పటి వరకు దీనికి భిన్నంగా జరిగింది. అటవిశాఖ అధికారులు ఇచ్చే వివరాలపై ప్రభుత్వం ఆధారపడుతున్నది. సమస్య మళ్లీ మొదటికొస్తున్నదని గిరిజనులు వాపోతున్నారు.2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా అటవీ శాఖే అడ్డుకున్నదన్న అనుమానాలు వారిలో ఉన్నాయి.వీటిని నివృత్తి చేసి చట్టాన్ని అమలుచేయాల్సిన ప్రభుత్వం చోద్యంచూస్తున్నది. ఈసమస్య ను పరిష్కరించాలని భావిస్తే ఇప్పటికే రెవెన్యూ,అటవీ శాఖలతో కలిసి, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేసి చట్టాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం పూనుకునేది. కానీ..ఆ పని జరగలేదు నాలుగు దశ ల్లో కమిటీలను ఏర్పాటు చేసి, చట్టంలో పేర్కొన్నట్టు 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న అన్ని రకాల అటవీ, పోడు భూముల సాగుదార్ల నుంచి వ్యక్తిగత, సామూహిక దరఖాస్తులను ఆహ్వానించి స్వీకరించిన ట్టుగానే ప్రస్తుత ఉపసంఘం కూడా అలాంటి కార్యాచరణ ను ప్రకటిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.
ఒక్క ఎకరానికి కూడా : రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకూ హక్కు పత్రం ఇవ్వలేదు. మొత్తం 13 లక్షల ఎకరాలకు గాను ఆర్‌ఒఎఫ్‌ఆర్ చట్టం కింద 7,61,061 ఎకరాల భూమికోసం 2,12,173 మంది గిరిజనులు, పేదలు వ్యక్తిగత దరఖాస్తులను స్వీకరించినట్టు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో 93,639 దరఖాస్తులకుగానూ 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలిచ్చి చేతులు దులుపుకున్నది. 1,18,534 దరఖాస్తులను కారణాలు చూపకుండానే తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఎకరాపై కూడా హక్కు కల్పించలేదు. 13 లక్షల ఎకరాల్లో.. హక్కు పత్రాలిచ్చిన 3,00,284 ఎకరాలను మినహాయిస్తే మిగిలిన 10లక్షల ఎకరాలపై ప్రభుత్వం హక్కులు కల్పించాల్సి ఉందని వారు కోరుతున్నారు.
- పోడు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
- సభా సంఘం సమావేశాలు సాగదీతకోసమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తున్నది. ఈ క్రమంలో మంత్రి సత్యావతి రాథోడ్ అధ్యక్షతన ఉన్న మంత్రి వర్గ ఉప సంఘం సమావేశాల నిర్వహణ కాలయాపన కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలోనే ఇప్పటికే రెండు సార్లు క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ యింది. ఎందుకు వాయిదాలు వేస్తున్నారో కూడా చెప్పడం లేదు. తిరిగి సమావేశాల తేదీలను మాత్రం ప్రకటి స్తున్నారు. ఇదంతా కాలయాపన కోసం కాకపోతే మరేంటి? అనేప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటీ రెండేండ్లు కాదు.. దశాబ్దాలుగా పోడు భూము లపై హక్కుపత్రాలకోసం గిరిజనులు ప్రభు త్వాలను వేడుకుంటున్నారు. వారి సమస్యలను పరిష్క రించడంలో గత ఏడేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. అటవీ హక్కుల చట్టం ఉన్నా.. అమలు చేయడానికి సర్కారుకు చిత్తశుద్ధి లేదన్న విషయం తేటతెల్లమైంది. కూర్చీవేసుకుని కూర్చొని పరిష్కరిస్తానంటూ సీఎం చెప్పినా..మంత్రి వర్గ ఉప సంఘాలను వేసినా అవన్నీ..కంటి తుడుపు చర్యలేనని విధితమవుతున్నది.