నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేతృత్వంలోని అధికార కూటమికి 'సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్'గా నామకరణం చేశారు.
బుధవారం చెన్నైలోని పనైయూర్లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన రెండో కూటమి సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీకే వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమన్వయ సమావేశానికి కాంగ్రెస్, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి కీలక కూటమి భాగస్వాముల నాయకులు హాజరయ్యారు.

