Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టేకు చెట్ల నరికి వేసిన నలుగురికి రిమాండ్.

టేకు చెట్ల నరికి వేసిన నలుగురికి రిమాండ్.

వతెలంగాణ - జన్నారం: జన్నారం రేంజ్, చింతగూడ సెక్షన్, చింతగూడ బీట్ పరిధిలోని అక్రమ టేకు చేటు నరికివేత కేసు లో నిందితులు 1. సట్ల రాజన్న 2. కొమిరే రాజం 3. ఆర్ పోషం, 4. మైనేని సురేష్ లను 12.05.2026 ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్ టీమ్, సంబంధిత చింతగూడ సెక్షన్ సిబ్బంది పై అటవీ నేరస్థులను పట్టుకున్నారు.

విచారణలో నిందితులు ఇతరులతో కలిసి రాత్రి వేళల్లో అడవిలోకి ప్రవేశించి టేకు చెట్లను అక్రమంగా నరికి కలపను విక్రయించినట్లు ఒప్పుకున్నారు. సట్ల రాజన్న మరియు కొమిరే రాజం గతంలో కూడా పలు అటవీ నేర కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. అటవీ సంపదను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని కొనసాగుతాయని అటవీ శాఖ హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana