Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని నగరంలోని టీఎన్జీవో ఎస్ భవనంలో మంగళవారం ఎన్నుకున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ ఉద్దీన్ ఆధ్వర్యంలో పి ఎన్ జి వై ఎస్ జిల్లా కార్యదర్శి అమృత్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ డ్రైవర్లతో సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ యూసుఫ్ ఉద్దీన్, ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు . ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామారావు. జాయింట్ సెక్రెటరీ రాజేందర్. సభ్యులుగా కిషోర్, మాక్ సూద్, శంకర్ మోసిన్ రాములు, కాశీం, అఫ్జల్, సాయిబాబా, తదితరులను ఎన్నుకున్నారు.

అనంతరం నూతన కార్యవర్గానికి టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అమృత్ శుభాకాంక్షలు తెలియజేసి పలు సూచనలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana