Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొంజేటి నారాయణ మృతి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొంజేటి నారాయణ మృతి

నవతెలంగాణ-పాలకవీడు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు కొంజేటి నారాయణ (94) ఆదివారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె గ్రామానికి ఆయన భౌతికకా యం తీసుకురాగా పలువురు నాయకులు, గ్రామస్తులు నివాళులర్పిం చారు. నేడు స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరు కానున్నారు. నారాయణ మృతి పార్టీకి తీరని లోటనీ, ఎన్నో ఆటుపో ట్లు, దాడులు తట్టుకున్న పలు పోరాటాల్లో పాల్గొన్నారనీ, అలాంటి గొప్ప యోధుడిని కోల్పోవడం బాధాకరమనీ జూలకంటి ఈ సంద ర్భంగా గుర్తుచేశారు.

పెంచికల్‌దిన్నె గ్రామానికి మొట్ట మొదటి సర్పం చ్‌గా పనిచేసిన నారాయణ.. గ్రామాభివృద్ధి ఎంతో కృషిచేశారు. వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా నాయకునిగా, హుజూర్‌నగర్‌ డివిజన్‌ కార్యదర్శిగా పనిచేశారు. చాలాకాలం సీపీఐ(ఎం) ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యునిగా సేవలందించారు. ఆయన సతీమణి సత్యవతి కూడా సాయుధ పోరాటంలో నారాయణతో కలిసి పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) సంతాపం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సేవలందించిన కొణిజేటి నారాయణ మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నారాయణ ప్రజల కోసం నిరంతర కృషి చేశారని తెలిపారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. పెంచికలదిన్నె గ్రామానికి మొదటి సర్పంచ్‌గా సేవలందించారని తెలిపారు. ఆయన మరణం ఆ ప్రాంత ప్రజలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana