Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ సార్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ సార్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను సమాజం ఎప్పటికీ స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.

ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి నేపథ్యంలో ఆయన అందించిన విశిష్ట సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వప్నాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని సీఎం కొనియాడారు. తెలంగాణే లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ప్రజలు ఎదుర్కొన్న వివక్షను గణాంకాలతో సహా దేశానికి వివరించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కే దక్కుతుందని ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం చిరస్మరణీయమనీ, ఆయన ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana