Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వొద్దు

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వొద్దు

కాంగ్రెస్ పోవాలి… కేసీఆర్ రావాలిసర్ను పారదర్శకంగా నిర్వహించాలి : సనత్ నగర్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు.

బీహార్, బెంగాల్తోపాటు ఇతర రాష్ట్రాల్లో సర్ పేరుతో గెలిచినట్టుగా తెలంగాణలో అధికారంలోకి వస్తామంటే కుదరదని చెప్పారు. బీజేపీ అరాచకాలు నడవకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 'కాంగ్రెస్ పోవాలి…కేసీఆర్ రావాలి' అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నదని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశానిఇ ముఖ్యఅతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా జరిగే ఈ ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా అనేక వివాదాలు సృష్టించిందని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓటర్లను, వారి మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఈ సర్ ను అడ్డగోలుగా వినియోగించడం వంటి అనేక ఆరోపణలున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో సర్ను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ లేదనీ, కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన గాలి వల్ల కొంత కనిపించిందని అన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ ఉన్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్నది కూల్చివేతలేనని అన్నారు. నగరంలో కనీసం తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ వంటి అంశాలను కూడా నిర్వహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. పార్టీ తరఫున ఎంపికైన బూత్ లెవెల్ అసిస్టెంట్లు, బీఎల్ఏలు ఒక్కరి ఓటు హక్కు కూడా అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కలిసి తొలగించకుండా కాపాడాలని సూచించారు. దీనికోసం సర్ ప్రక్రియ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అవసరమైతే దీనికోసం మరోసారి బీఎల్ఏలకు పార్టీ తరఫున శిక్షణా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana