Dailyhunt
తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లుగా ఐదు గ్రామాలు

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లుగా ఐదు గ్రామాలు

నిజామాబాద్: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఐదు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ గ్రామాలన్నీ కూడా బోధన్ డివిజన్‌లో ఉన్నాయని ఆర్డీవో రాజేశ్వర్ తెలిపారు. వర్ని మండలంలోని సిద్దాపూర్, కోటగిరి మండలంలోని సుంకిని, బోధన్ మండలంలోని సాలూరా క్యాంపు, రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, నీలా పేపర్ మిల్ గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు ఆర్డీవో రాజేశ్వర్ తెలిపారు. ఈ గ్రామాల ప్రజలు కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana