Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు

తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించవద్దని.. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. అదికూడా మాస్కులు, భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టంఉ2005 కింద ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆంక్షలను, రాత్రి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగాపెరుగుతున్న నేపథ్యంలో, గత నెల 23న కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana