హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరఫున మంత్రులు ఆదివారం నామినేషన్ వేశారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ తరఫున మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ నామినేషన్ దాఖలు చేశారు.

