Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టిఆర్పి నూతన కమిటీ ఎన్నిక

టిఆర్పి నూతన కమిటీ ఎన్నిక

వతెలంగాణ-ఆలేరు టౌనుతెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు కొమరిశెట్టి నరసింహులు ఆధ్వర్యంలో టిఆర్పి ఆలేరు మండల అధ్యక్షునిగా చింతపండు వెంకటేష్ ని, పట్టణ అధ్యక్షునిగా చక్కెరవి ఉపాధ్యక్షుడిగా కొండ పరమేష్ లను, నియమిస్తూ ఆలేరు పట్టణంలో శనివారం నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మరింత బలోపేతమై ముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతకింది ఉష, లూనావత్ నరేందర్, లక్ష్మణ్ నాయక్, నవీన్ నాయక్, సంగురాజు, సునీత తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana