Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీ-ఈఏపీసెట్లో కామారెడ్డి విద్యార్థుల సత్తా

టీజీ-ఈఏపీసెట్లో కామారెడ్డి విద్యార్థుల సత్తా

- రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ ముక్రమ్ అహ్మద్ను అభినందించిన షబ్బీర్ అలీనవతెలంగాణ - కామారెడ్డి
టీజీ - ఈఏపీసెట్ (వ్యవసాయ, ఫార్మసీ విభాగం)లో రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ ప్రథమ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన విద్యార్థి ముక్రమ్ అహ్మద్ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గురువారం సచివాలయంలోని తన కార్యాలయ ఛాంబర్లో ఘనంగా అభినందించారు.

టీఎంఆర్,ఈఐఎస్కు చెందిన ముక్రమ్ అహ్మద్ 150.17 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించడం పట్ల షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి ప్రతిభ, కృషి, క్రమశిక్షణకు ఇది నిదర్శనమని కొనియాడారు.

భవిష్యత్తులో ఉన్నత విద్యతో పాటు వృత్తి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణానికి చెందిన ఇతర మైనార్టీ విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రశంసించారు. అస్మా జుబిన్ బై .పీసీ -2 విభాగంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు, షారికా ముస్కాన్ బై .పీసీ -2లో రాష్ట్ర తృతీయ ర్యాంకు, హురాయా దిల్సాత్ ఎంపీసీ -1లో రాష్ట్ర తృతీయ ర్యాంకు, ఆయేషా సిద్ధిఖా బై .పీసీ -1లో రాష్ట్ర తృతీయ ర్యాంకు, అఫియా తబ్బస్సుమ్ బై .పీసీ -1లో రాష్ట్ర నాల్గవ ర్యాంకు సాధించడం పట్ల అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాల సాధనలో ఇదే పట్టుదలతో ముందుకు సాగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana