Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలిసారిగా డాలర్@96

తొలిసారిగా డాలర్@96

అత్యంత అధ్వానస్థితిలోకి రూపాయి

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కె ట్లో రూపాయి విలువ అత్యంత అధ్వానస్థితిలోకి జారుకుంది. చర్రితలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోడీ హయంలో ఆల్టైం కనిష్ట స్థాయికి పడిపోయింది.

ముడి చమురు ధరలు నిరంతరం పెరగడం, ద్రవ్యోల్బణ ఆందోళనలు, వాణిజ్యలోటు పెరగడం, విదేశీ మారకం నిల్వలు తగ్గడం,
ఎఫ్డిఐలు పడిపోవడం తదితర కారణాలతో శ్రుకవారం ఇంట్రాడేలో డాలర్తో పోల్చితే రూపాయి ఏకంగా 96.14 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) జోక్యంతో కొంత కోలుకుని చివరికి 30 పైసలు నష్టపోయి 95.94కు పరిమితమయ్యింది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి విలువ దాదాపు 2 శాతం మేర క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మొత్తం 6 శాతానికి పైగా నష్టపోయింది. వారాంతం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 46.10 పాయింట్లు తగ్గి 23,643.50 వద్ద నమోదయ్యింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana