Dailyhunt
తుంగతుర్తి పులిబిడ్డ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

తుంగతుర్తి పులిబిడ్డ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

వతెలంగాణ - తుంగతుర్తితండ్రి ఆశయాలను… తన బాధ్యతలుగా… భుజస్కందాలపై వేసుకొని మోస్తున్న… తుంగతుర్తి గడ్డ… పులిబిడ్డ…రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు… మాజీ మంత్రి, దివంగత నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ఆయన తనయుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుణికిపుచ్చుకున్నారు.

తండ్రి చూపిన మార్గం, ప్రజల అండతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలలోని ప్రతి గ్రామంలోని కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అధైర్య పడకండి… మీవెంటే నేను అంటూ… ప్రజలతో నేరుగా మమేకమవుతూ, క్యాడర్ను బలోపేతం చేస్తూ, స్థానిక నాయకులను కల్పిస్తూ, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజల మనసుల్లో తనదైన రాజకీయ ముద్ర వేసుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచుల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి కృషి చేశారు. పేట ప్రజలను ఐక్యం చేసి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కృషి చేశారు.

కాంగ్రెస్ పార్టీలో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (టైగర్) పేరు ప్రజల్లో నమ్మకానికి ప్రతీక. రైతుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన ఆయన వారసత్వాన్ని, ప్రజాసేవా స్ఫూర్తిని తనయుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల పట్ల ఆత్మీయత, సేవ పట్ల అంకితభావం, యువత పట్ల దృఢమైన నిబద్ధత.. ఇవన్నీ ఆయన నాయకత్వంలో ప్రతిఫలిస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు పొందడం యాదృచ్ఛికం కాదు. ఆయన కృషికి వచ్చిన గుర్తింపే అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లా నుండి ఏదో ఒక నియోజకవర్గం నుండి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana