Dailyhunt
ఉచిత గాలికుంటి వ్యాధి టీకాలు.

ఉచిత గాలికుంటి వ్యాధి టీకాలు.

వతెలంగాణ - సదాశివనగర్ : రాష్ట్ర గాలికుంటు వ్యాధి నివారణ నోడల్ ఆఫీసర్ డాక్టర్ షకిల్, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీనివాస్ ఎడి జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం అడ్లూరు ఎల్లారెడ్డిలో ఆకస్మిక తనిఖీ చేశారు.

జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ భరత్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసుకోవడం వల్ల పశువులకు రోగనిరోధక శక్తి ఉత్పాదకత పెరుగుతుందని తెలియజేశారు .ప్రతి ఒక్క రైతు ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. డాక్టర్ షకీల్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం చే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ అనూష , ఎల్ ఎస్ ఏ అహల్య గోపాలమిత్ర కాశిరెడ్డి , పాడి రైతు చిన్నయ్య పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana