Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్వేగ పరమైన మానసికతకు 'నోస్టాల్జియా' ఒక ఉప్పస

ఉద్వేగ పరమైన మానసికతకు 'నోస్టాల్జియా' ఒక ఉప్పస

తాజ్ మహమ్మద్ కవిగా పరిణామం చెందటానికి జీవితంలోని 'సంఘర్షణ' ప్రధాన వనరుగా పనిచేసింది. తెలంగాణ ముస్లిం జీవితాలు అర్థం చేసుకోవడానికి మనిషికి కాసింత అధ్యయనం, అవగాహన అవసరమైతయి.

దూదేకుల, నూర్ బాష్, పింజారి వంటి వాళ్లు ముస్లింలలో వివక్షతకు గురి కాబడుతున్నవారిగా పరిగణిస్తాం. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు కలగలిసిన ముస్లిం పద్ధతులతో వారి సంస్కతి వైవిధ్యభరితంగా వుంటది. అటు పూర్తి హిందువులుగానూ, ఇటు పూర్తి ముస్లింలుగానూ వుండలేక రెండు వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కుంటున్నరు.

పరదా పద్ధతిని, ఇస్లాం ఆచారాల్ని పురాగ ఆచరించలేక; ఎములాడను, ఉప్పలమ్మను వివిధ గ్రామ దేవతల ఆరాధనను వదులుకోలేక ప్రపంచంలో ఏ దురదష్టకర సంఘటన జరిగినా తామే ఆ అపవాదును మోయాల్సిన పరిస్థితుల్ని భౌతికంగానూ, మానసికంగానూ కల్పించబడుతున్న వాతావరణంలోంచి చదువుకొని, ఎదిగి, తనలాంటి జీవితాల్ని అక్షరాలుగా మలుస్తూ తానేంటో నిరూపించుకుంటున్న కవి తానూ ఈ దేశ మూలవాసినని చెప్పుకోవాల్సి రావడం, పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావడం నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్ని ప్రతిబింబిస్తది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నూతన మండల కేంద్రంగా ఏర్పాటైన కొత్తపల్లి గోరి తన స్వస్థలం. సులేమాన్ గోరి కొత్తపల్లిని పొందిచ్చిన వ్యక్తిగా చెబుతరు. వివిధ కారణాల వల్ల సులేమాన్ గోరి ఊరు విడిచి వెళ్ళినప్పటికీ తన పేరు మీదనే ఊరు పేరు స్థిరపడింది. సులేమాన్ గోరి దగ్గర తాజ్ మహమ్మద్ తాత పనిచేసేవారు. తాత పేరునే తన పేరుగా అస్తిత్వాన్ని కొనసాగిస్తున్న కవి నోస్టాలియా రూపంలో తన పేదరికాన్ని, పాయిరాన్ని, ఆత్మీయతను గుండెకు హత్తుకునేలా ఒక దశ్యాన్ని వచన కవితగా ఆవిష్కరించడం చూస్తాం.

'ఒంటి నిట్టాడు గుడిసె' కవి బాల్యస్మతి. దాదీ తో కలిసి కుటుంబమంతా ఆ గడ్డి గుడిసెలో ఎలా జీవనం కొనసాగించారో, గుడిసెతో కవికి వున్న ప్రేమైక బంధం ఎలా పెనవేసుకుపోయిందో ఎట్ల తమ జీవితాల్ని గట్టెక్కించిందో నెమరువేసుకోవడం ఈ కవితలో చిత్రించబడింది. కవి 'ఒంటి నిట్టాడు గుడిసె' ను రకరకాల పోలికలతో గుర్తుంచుకున్న తీరుకు ముచ్చట పడుతం. తల్లికోడిలా, పీర్ల పండగ షర్బత్ పటువ అని గుడిసెను ప్రతీకరించడం వెనుక ఔచిత్యవంతమైన సందర్భాల్ని, వాతావరణ చిత్రణను అనుభవంలోకి తీసుకుంటం. అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితులకు 'సర్దుబాటు' చేసుకునే తత్వం కనిపిస్తది. వర్షం, వరద వలన గుడిసెలోకి బురద నీరు వచ్చినా, మట్టిగోడలు నానినా అటువంటి స్థితిని కవిత్వంలోకి తీసుకొచ్చేటప్పుడు కవి సజనాత్మకంగా ఎలా వ్యక్తీకరిస్తున్నాడో గమనిస్తాం. చూరు నీళ్లతో, వానజల్లులతో వణుకుతున్న పిల్లల్ని 'గుడిసె' పొదువుకోవడంలో, మాతత్వాన్ని గుడిసెకు ఆపాదిస్తూ 'తల్లికోడి' తో పోలిక చెబుతూ మానవ గుణారోపణ (Personification) ద్వారా ఒక దశ్య శకలాన్ని కవి పరిచయం చేయడం గమనిస్తాం.

నానిన మట్టి గోడలు తడిగా వుండటం సహజం. నీటికుండ చిమ్మటిచ్చినట్లు 'గుడిసె'ను షర్బత్ పటువ అనడంలో కవి పేదరికాన్ని ఉన్నతీకరించడం, ఎంత హుందాగా వ్యక్తీకరించాడో పరిశీలిస్తాం. వరదొస్తే ఇంటిచుట్టూ నీరు నిలిస్తే వాటి మరకలు గుడిసె గోడలపై వుండటాన్ని గమనించిన కవి 'తెల్లని గీతల గంధం' పూసుకున్నట్టుగా వ్యక్తీకరించడంలోని 'సూక్ష్మ పరిశీలన'కు అబ్బుర పడతాం. ప్రవాహం ఎక్కువై అదే వరదనీరు ఇంట్లోకి వస్తే ఎలా వుంటది ? పాఠకుల ఊహను వఞ్వఅస చేస్తూ, విస్తరిస్తూ కవి చూరుసుక్కల తాళం, నులకమంచం మీద నిద్ర పుచ్చడంగా మలుపు తిప్పడం సజనాత్మక నైపుణ్యం ఎలాంటిదో దర్శిస్తాం.

'గుడిసె' వానను వెనకేసుకురావడం, కడుపు నింపడానికి అగ్గి రాజేయడంలోని అమ్మతనం అవగతమైతది. బీదరికంలోనూ ఎక్కడా చిన్నతనం రాకుండా అతిథుల్ని చూసుకోవడానికి ముందస్తు ఆలోచన చేయడం, మర్యాదలో ఏ లోటూ రాకుండా వుండటానికి కవి బువ్వకుండను ఎత్తుకున్న జనపనార ఉట్టీని ప్రవేశపెట్టడంలోని గౌరవప్రదమైన బతుకు జీవన చిత్రణ కనిపిస్తది. మట్టిగోడ కూలడం, కూలితే కష్టం తప్పేదని తమను తాము సముదాయించుకోవడం ఒక రక్షణ తంత్రంగా పనిచేసింది. తల్లితోడ ఎనమండుగురిని సాదడం చాలా రకాల భావనలకు పాదులు తీసింది. తల్లిదండ్రులకు పనుల్లో తలలో నాలుకలా వుండటం, జీవకారుణ్యాన్ని ప్రోత్సహించడం, జాగున్నంత మేరకే కాళ్లు సాపుకోవడం, అమ్మీని, అమ్మీ కష్టాన్ని 'గుడిసె' తల్సుకోవడం, గుడ్లల్ల నీళ్లదీసుకోవడం ఇంట్లో మనిషిని తలపిస్తది.
ముగింపు రెండు రకాలుగా అర్ధం చేసుకోనే అవకాశం ఇస్తది. ఒకటి 'బీవీ' 'కవి గుండెలపై వాలడంగానూ, 'గుడిసె' కవి గుండెలపై వాలడంగానూ ఒకే సమయంలో అనుభూతికి లోనవడం పాఠకుల వంతవ్వగలదు. 'తాజ్ మహమ్మద్' భవిష్యత్తు వున్న కవి. సరైన వస్తువుల్ని ఎంపిక చేసుకోవడంలోనే తన అస్తిత్వాని, ఘర్షణను, మతసామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, సోదరభావాన్ని తన కవిత్వం ద్వారా వినిపించగలడు. 'నోస్టాల్జియా' ను బలంగా పలికించిన కవికి శుభాకాంక్షలు.

- బండారి రాజ్ కుమార్, 8919556560

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana