Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమకారుల గుర్తింపు కమిటీపై హర్షం

ఉద్యమకారుల గుర్తింపు కమిటీపై హర్షం

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలుతెలంగాణ ఉద్యమకారుడు ముడితనపెల్లి ప్రభాకర్
నవతెలంగాణ - మల్హర్ రావు

తెలంగాణ మలిదశ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ ఉద్యమకారుడు ముడితనపెల్లి ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేసేందుకు చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డి,ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్గా నియమితులైన కె.

కేశవరావుతో పాటు కమిటీ సభ్యులుగా నియమితులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్,ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి లకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యమకారులందరికీ త్వరలోనే పూర్తి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana