Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగులకు గుడ్న్యూస్..

ఉద్యోగులకు గుడ్న్యూస్..

హైదరాబాద్ : ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. గ్రాట్యుటీ కాలపరిమితిని ఐదేళ్ల పాటు కాకుండా ఒక సంవత్సరానికి తగ్గించే బిల్లు పార్లమెంట్‌కు చేరింది. అంటే ఇకపై ఒక సంవత్సరం పాటు పనిచేసినా గ్రాట్యుటీ చెల్లిస్తారు. కార్మిక చట్టాలకు సంబంధించి మూడు బిల్లులను కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అందులో ఆక్యుపేషనల్ సేఫ్టీ,హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020, ఇండ్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్లులో పలు ప్రొవిజన్స్ జోడించారు. వాటిలో ఒక దానిలో గ్రాట్యుటీ గురించి ప్రస్తావించారు. గ్రాట్యుటీ ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే చెల్లించాలని అందులో పొందుపరిచారు సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని కొత్త ప్రొవిజన్స్ ప్రకారం ..

ఇకపై ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ లభిస్తుంది. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. ఒక సంస్థలో కనీసం ఏడాది పాటు పనిచేస్తే చాలు గ్రాట్యుటీ అందుతుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 లోక్‌సభ, రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది.

ఆ తర్వాత చట్టరూపం దాల్చుతుంది. అప్పుడే గ్రాట్యుటీ నియమ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి గ్రాట్యుటీ అంటే ఏంటి? ఒక కంపెనీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఉద్యోగికి వేతనం, పెన్షన్, పీఎఫ్‌తో పాటు గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఇన్నాళ్లు తమ కంపెనీకి అందించిన సేవలకు గాను ఉద్యోగికి సంస్థ ఇచ్చే రివార్డ్ అన్న మాట. గ్రాట్యుటీ కోసం ఉద్యోగి జీతం నుంచి స్వల్ప మొత్తాన్ని తగ్గిస్తారు. ఎక్కువ మొత్తం మాత్రం కంపెనీయే చెల్లిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana