Dailyhunt
ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

హైదరాబాద్ : పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నివేదిక ప్రతులతో బీఆర్కే భవన్ వద్దకు వచ్చిన.. ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎస్ను కలుస్తామన్న పీసీసీ అధికార ప్రతినిధులను పోలీస్ స్టేషన్కు తరలించారు. గణతంత్ర వేడుక రోజున సీఎం కేసీఆర్ నుంచి మంచి ప్రకటన వస్తుందేమోనని ఉద్యోగులంతా వేచిచూశారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అన్నారు. మంచి పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులు ఆశించారన్నారు. కేవలం 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని.. కమిటీ సిఫార్సు చేయడం చాలా దారుణమన్నారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana