Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప సర్పంచుల మండల ఫోరం కమిటీ ఎన్నిక

ఉప సర్పంచుల మండల ఫోరం కమిటీ ఎన్నిక

వతెలంగాణ-వర్ధన్నపేటవర్ధన్నపేట మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా కట్ర్యాల గ్రామానికి చెందిన నాంపల్లి రవీందర్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం, గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులు గా సంకినేని గంగరాజు అధ్యక్షులు: నాపల్లి రవీందర్ ,ఉపాధ్యక్షులు: ముత్యాల దేవేందర్, బుక్క తిరుపతిప్రధాన కార్యదర్శి: మంద రవి,కార్యదర్శి అగర్వాల్ రాజు, కోశాధికారి: మెట్లరమేష్,కమిటీ సభ్యులు గాకుల్ల రాకేష్, గొలుసుల మహేందర్, ఎస్.కె. మధార్, బుక్క భిక్షపతి, బోచ్చు జ్యోతియాదగిరి, చెన్ని ఎల్లయ్య, సొంటి స్రవంతి, అడుసుల స్రవంతి, కుంద సుమలత, జోగుల చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి..ఉప సర్పంచ్ ల మండల ఫోరం అధ్యక్షులు నాంపల్లి రవీందర్
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల ఫోరం అధ్యక్షులు నాపల్లి రవీందర్ మాట్లాడుతూ.. మండలంలోని ఉప సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి, మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎంపికకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉప సర్పంచులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana