నవతెలంగాణ - భిక్కనూర్ (రాజంపేట్)ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీవో బాలకృష్ణ తెలిపారు.
గురువారం మండలంలోని నడిమి తండా గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా కూలీలకు పనులు కల్పించాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజాము నుండే ఉపాధి హామీ పనులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్ లకు సూచించారు.

