Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

వతెలంగాణ-నసురుల్లాబాద్ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నసురుల్లాబాద్ ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ సూచించారు. బుధవారం మండలంలోని సంగెం ( ఏ) గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలు తీరును పరిశీలించారు.

ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన కందకాలు, చెరువుల పూడికతీత, మొక్కల పెంపకం, సెగ్రిగేషన్ షెడ్డు, తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకాలను ఉపాధి హామీ కూలీలు, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. వీరి వెంట ఎంపీఎం సౌజన్య, టెక్నికల్ అసిస్టెంట్ లావణ్య, సాయిలు, గ్రామ సర్పంచ్ లు , తరుణ్ నాయక్, వినోద్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana