Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధ్యాయుల సమస్యలపై తహశీల్దార్ కు వినతి

ఉపాధ్యాయుల సమస్యలపై తహశీల్దార్ కు వినతి

వతెలంగాణ-మర్రిగూడ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్ పిసి ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు యుఎస్ పిసి మండల కమిటీ ఆధ్వర్యంలో రెండో దశ పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం యు ఎస్ పి సి నాయకులు తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా యుఎస్ పిసి మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి నివేదికను వెంటనే తెప్పించుకొని 1జూలై 2023 నుండి అమలు చేయాలని అన్నారు.

ఉపాధ్యాయుల పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని,సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని,జీవో 25 సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతి ఒక టీచర్ ను కేటాయించాలని,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనం చెల్లించాలని,కస్తూర్బా ఉపాధ్యాయులకు మినిమం వేతన స్కేల్ అమలు చేయాలని,సమ్మె కాలపు వేతనము చెల్లించాలని,తదితర సమస్యలకు పరిష్కారం కోరుతూ తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు నాగవరం శ్రీనివాసరావు,డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పాక నాగేంద్రమ్మ,మండల కమిటీ సభ్యులు టి.రత్నకుమారి,వై.హనుమంతు,బి. శ్రీనివాస్,రజియోద్దీన్,ఎన్.వెంకటయ్య,పసునూరి శ్రీనివాస్,వి.సుధారాణి,రేణుక,కల్పన తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana